Lanka dinakar: ‘పీఎం-శ్రీ’ తో మారనున్న పాఠశాలల రూపురేఖలు

ABN , First Publish Date - 2022-09-08T15:35:06+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పీఎం - శ్రీ స్కీమ్ ద్వారా దేశంలో 14,500 పాఠశాలల రూపురేఖలు మార్చడం అంటే భవిష్యత్తు మానవ వనరులను అభివృద్ధి చేయడమే అని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

Lanka dinakar: ‘పీఎం-శ్రీ’ తో మారనున్న పాఠశాలల రూపురేఖలు

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ‘‘పీఎం - శ్రీ’’ (PM - Shri scheme) స్కీమ్ ద్వారా దేశంలో 14,500 పాఠశాలల రూపురేఖలు మార్చడం అంటే భవిష్యత్తు మానవ వనరులను అభివృద్ధి చేయడమే అని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పాఠశాలల ఆధునీకరణ ప్రణాళిక రూ.27,360 కోట్లు కాగా, అందులో 70% కేంద్ర ప్రభుత్వం (Union government) నిధులు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ నిధులను పక్కకు మళ్లించకుండా, వ్యక్తిగత పేర్లతో స్టిక్కర్లు వేయకుండా పాఠశాలల ఆధునీకరణ జరిగితే మంచిదని హితవుపలికారు. విద్యా ప్రమాణాలను పెంచడం, పిల్లలకు నాణ్యమైన ఆహర పోషణ, పుస్తకాలు, డ్రస్, బ్యాగ్, షూ తదితర అవసరాలకు కేంద్రం నిధులు ఇస్తుందని లంకా దినకర్ వెల్లడించారు. 


Updated Date - 2022-09-08T15:35:06+05:30 IST