రుణం కోసం అమరావతి భూముల తనఖా దారుణం: Lanka dinakar

ABN , First Publish Date - 2022-02-07T14:21:29+05:30 IST

రుణం కోసం 480 ఏకరాల అమరావతి భూములును తనఖా పెట్టడం దారుణమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

రుణం కోసం అమరావతి భూముల తనఖా దారుణం: Lanka dinakar

అమరావతి: రుణం కోసం 480 ఏకరాల అమరావతి భూములును తనఖా పెట్టడం దారుణమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సీఆర్డీఏ చట్టం పునరుద్ధరణ భూముల ద్వారా అప్పులు తెచ్చాది... రైతులను తిప్పలు పెట్టడానికేనా? అని ప్రశ్నించారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రుణాల నిధులు పక్కకు మల్లించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఉద్యోగులు పెన్ డౌన్ సమయంలో రాజధాని భూముల తనఖా రిజిస్ట్రేషన్ కోసం పెన్ ఎలా కదిలిందని నిలదీశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎకరా ధర రూ.7 కోట్లు అని ప్రభుత్వం చూపుతున్నప్పుడు, ఆ లెక్క ప్రకారం పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని అడిగారు. రుణాలు ఎలా తీసుకొని, దశలవారీగా దేనికి ఎలా ఖర్చు చేయాలో సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా ఉందని... దాన్ని అతిక్రమించి రుణాలు మంజూరు చేయకూడదని డిమాండ్ చేశారు. సీఆర్డీఏ పరిధిలో రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూముల సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మాత్రమే రుణాలు తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి కోసం కాకుండా అమరావతి భూముల అమ్మకం, రుణాలు సేకరించడం నేరమన్నారు. దీనిపైన కోర్టుకి విన్నవించుకుంటామని లంకా దినకర్ తెలిపారు. 

Updated Date - 2022-02-07T14:21:29+05:30 IST