
అమరావతి: రాజధాని రైతులకు సీఆర్డీఏ అనే రక్షణ ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు లంకాదినకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి న్యాయస్థానాలు బాసటగా నిలిచాయన్నారు. అమరావతి రైతులకు అనుగుణంగా తీర్పు వస్తుందనే దాన్ని ఆలస్యం చేయడానికి చట్టాలు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో 40 వరకు కేంద్ర సంస్థలు ఏర్పాటు చేస్తాం అని ముందుకు వచ్చాయని... అయితే వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని లంకా దినకర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి