రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించటం వల్ల ప్రయోజనం ఏమిటీ: లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-01-31T23:13:23+05:30 IST

రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ సీనియర్

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించటం వల్ల ప్రయోజనం ఏమిటీ: లక్ష్మణ్

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఖండించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించటం వలన తెలంగాణకు ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదన్నారు. రాచరిక వ్యవస్థకు కేసీఆర్ అలవాటు పడ్డాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ హామీల అమలు కోసం  ప్రజలు ఆందోళనకు సిద‌్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికా, యూరప్ దేశాలకు సాధ్యంకాని స్వదేశీ కంపెనీతో వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత మోదీదేనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లను‌‌ దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం చేస్తోందన్నారు. తెలంగాణ మంత్రులు బావిలో కప్పలని ఆయన పోల్చారు. మిషన్ భగీరథను అవినీతికి కేరాఫ్‌గా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వలనే ఆయష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావటం‌ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా సొంతంగా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుందామన్న కేటీఆర్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. బయ్యారంపై కేసీఆర్, కేటీఆర్‌లు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-31T23:13:23+05:30 IST