నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా..

ABN , First Publish Date - 2022-01-13T01:02:34+05:30 IST

"నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా"నని బీజేపీ జాతీయ నాయకుడు

నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా..

హైదరాబాద్‌: "నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా"నని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధరరావు ప్రకటించారు. నగరంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను అవినీతి అంశంలో జైలుకు పంపడం ఖాయమన్నారు. అవినీతి చేసినవారు ఎంతటివారైనా జైలుకెళ్లాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పోటీలోనే లేదన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిని నియమించుకునే పరిస్థితిలో లేదన్నారు. టి.కాంగ్రెస్‌లో పంచాయితీలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఆ పార్టీ నేతలున్నారని మురళీధరరావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-13T01:02:34+05:30 IST