మేం తలచుకుంటే రాష్ట్రాన్ని విభజిస్తాం

ABN , First Publish Date - 2022-07-06T15:31:02+05:30 IST

తమిళనాడును రెండుగా విభజించే సత్తా తమకుందని బీజేపీ శాసనసభ పక్ష నేత నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వ తీరుకు నిరసనగా

మేం తలచుకుంటే రాష్ట్రాన్ని విభజిస్తాం

                           - Bjp నేత నయినార్‌ నాగేంద్రన్‌


పెరంబూర్‌(చెన్నై), జూలై 5: తమిళనాడును రెండుగా విభజించే సత్తా తమకుందని బీజేపీ శాసనసభ పక్ష నేత నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు జరిగాయి. తిరునల్వేలిలో జరిగిన దీక్షలో పాల్గొన్న నయినార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ.. కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. అవసరమైతే తమిళనాడు విభజనకు డిమాండ్‌ చేస్తామంటూ రాజా చేసిన వ్యాఖ్యలపై నాగేంద్రన్‌ మాట్లాడుతూ.. తమిళనాడును రెండుగా విభజించలేమని భావించొ ద్దన్నారు. ఆంధ్ర, తెలంగాణా మాదిరిగా తమిళనాడును రెండుగా విభజించాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్నామనే విషయం మరచిపోవద్దని హెచ్చరించారు. తమిళనాడును విభజించాలనుకుంటే రెండుగా విభజించి తీరుతామన్నారు. ఇదే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశముందని నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-06T15:31:02+05:30 IST