కేసీఆర్‌లో ఫెడరల్ స్ఫూర్తి లోపించింది: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ABN , First Publish Date - 2022-02-25T21:36:55+05:30 IST

సీఎం కేసీఆర్‌లో ఫెడరల్ స్ఫూర్తి లోపించిందని బీజేపీ నేత

కేసీఆర్‌లో ఫెడరల్ స్ఫూర్తి లోపించింది: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌లో ఫెడరల్ స్ఫూర్తి లోపించిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కేంద్ర పథకాలైన అవాస్ యోజన, ఫసల్ బీమా, ఆయుష్మాన్  భారత్, ఆత్మ నిర్బర్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు కాకపోవడంతో పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ దృష్టికి తెలంగాణలోని అనేక అంశాలను  తీసుకెళ్ళానని ఆయన పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే.. సర్పంచ్‌లను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తుందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి కేసీఆర్ విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఆత్మనిర్భర భారత్ ద్వారా కేంద్రం అనేక రాయితీలు ఇస్తుంటే తెలంగాణలో మాత్ర అమలు చేయడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వే, రహదారులకు అధిక నిధులు కేటాయించిందన్నారు. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-02-25T21:36:55+05:30 IST