వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పోటీ చేస్తాయి...ఎన్వీఎస్‌ఎస్ జోస్యం

ABN , First Publish Date - 2022-04-18T18:50:40+05:30 IST

టీఆర్ఎస్‌కు రాబోయే ప్లీనరీ ఆఖరిదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పోటీ చేస్తాయి...ఎన్వీఎస్‌ఎస్ జోస్యం

హైదరాబాద్: టీఆర్ఎస్‌కు రాబోయే ప్లీనరీ ఆఖరిదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పోటీచేయబోతున్నాయని జ్యోసం చెప్పారు. కేసీఆర్‌ను దగ్గర చేసుకోవడానికే సోనియా రేవంత్ రెడ్డిని పీసీసీ చేశారని  అన్నారు. సోనియా, రాహుల్ కాదు.. టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని ప్రశాంత్ కిషోర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎల్పీని విలీనం చేసుకుంటే మాట్లాడని చేతకాని నేతలుచ నాయకులు సోనియా, రాహులు గాంధీలు అని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ను ప్రశాంత్ కిషోర్  తృణమూల్‌ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారన్నారు.


పాదయాత్రకు వస్తోన్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకనే బండిపై మంత్రులు విమర్శలు చేస్తున్నారని అన్నారు.  ఉద్యమంలో అందరి పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మిగిలిందని ఆయన దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్స్‌ను గెంటివేశాక.. పార్టీలో కేసీఆర్ ఒక్కరే మిలిగిలారన్నారు. 21 ఏళ్ళ ప్రస్థానంలో టీఆర్ఎస్ అవినీతి, ఫిరాయింపుల పార్టీగా పేరు గడించిందని తెలిపారు. తెలంగాణను వద్దన్న నాయకులు మాత్రమే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారన్నారు. టీఆర్ఎస్‌కు తెలంగాణలో నూకలు చెల్లాయని అన్నారు.  వర్కింగ్ ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్‌లు మాత్రమే మిగులుతారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-04-18T18:50:40+05:30 IST