రాహుల్ హార్ట్ బీట్స్ ఫర్ కేసీఆర్: NVSS

ABN , First Publish Date - 2022-04-30T19:10:41+05:30 IST

తెలంగాణకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నారో చెప్పాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.

రాహుల్ హార్ట్ బీట్స్ ఫర్ కేసీఆర్: NVSS

హైదరాబాద్: తెలంగాణకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నారో చెప్పాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో 351 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దీనిపై ఎప్పుడైనా.. ఎక్కడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఏనాడూ మాట్లాడని రాహుల్ గాంధీ ఉస్మానియా ఎలా వస్తారని బీజేపీ నేత నిలదీశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు.. కేసీఆర్ కేంద్రమంత్రి కావడానికి కారణం రాహుల్ అని అన్నారు. పీకే స్కెచ్ మేరకే కేసీఆర్ కోసమే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. రాహుల్ రాక కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌కే ఎక్కువ లాభమని చెప్పారు. రాహుల్ హార్ట్ బీట్స్ ఫర్ కేసీఆర్ అని అన్నారు. తన మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రానికి చేకూరిన లబ్ది గురించే గడ్కరీ చెప్పారని తెలిపారు. కేంద్రమంత్రులు హూందాగా వ్యవహరిస్తారని... టీఆర్ఎస్ పార్టీ నేతల తరహాలో చిల్లరగా మాట్లాడరని మండిపడ్డారు. 111 జీవో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వెల్లడించారు. 

Updated Date - 2022-04-30T19:10:41+05:30 IST