
విజయవాడ: ప్లాన్ ప్రకారమే కోనసీమలో అల్లర్లు సృష్టించారని బీజేపీ నేత సత్యకుమార్ (Satya kumar) ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఇంటినే దహనం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు చేశారని మండిపడ్డారు. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉందని అన్నారు. వైసీపీ నేతల్లో కొందురు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్ అన్నారని తెలిపారు. దావోస్ వెళ్లిన సీఎం పైసా పెట్టుబడి కూడా తీసుకురాలేదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి