
అమరావతి: మద్యంపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత సోమువీర్రాజు సమర్థించుకున్నారు. తాను తక్కువ ధరకే మద్యం అమ్ముతానని చెప్పింది తన ఆడుపడుచుల కోసమే అని తెలిపారు. 250 రూపాయలకు మందు అమ్మి పేదవాడి రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. పేదల బలహీనతలను వైసీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. మందు రెట్లు తగ్గిస్తా అన్నది... వచ్చే కూలీ డబ్బుల్లో కొంతైనా ఇంట్లో ఇస్తారని మాత్రమే అని చెప్పుకొచ్చారు. ‘‘పేదవాడి కోసం ఆలోచించి నేను మద్యం కోసం మాట్లాడాను.. నేను పేదల పక్షపాతిని’’ అని సోమువీర్రాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి