బడ్జెట్ పొంతన లేదు.. హాస్యాస్పదంగా ఉంది: Somuveerraju

ABN , First Publish Date - 2022-03-11T18:33:45+05:30 IST

బడ్జెట్ పొంతన లేదని.. హాస్యాస్పదంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ పొంతన లేదు.. హాస్యాస్పదంగా ఉంది: Somuveerraju

కాకినాడ: బడ్జెట్ పొంతన లేదని.. హాస్యాస్పదంగా  ఉందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.  శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్ చిత్తు కాగితంలా ఉందన్నారు. అంచనాలకు మించి దాఖలాలు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాడ్డాక ఇప్పటి వరకు చేసిన అప్పులు లెక్కలు ఎందుకు పేర్కొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు లేవని... ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు రాష్టానికి ఏమీ చేయలేదన్న వైసీపీ... రాష్ట్ర బడ్జెట్‌లో ఎం కేటాయించారో చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-11T18:33:45+05:30 IST