
అమరావతి: రైతులకు అండగా బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. లక్షల టన్నుల ధాన్యం వరి కళ్లాల్లో ఉండడంతో రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. ఖాళీలున్నా ఎందుకు భర్తీ చేయడం లేదని సోమువీర్రాజు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి