వైసీపీని గద్దె దింపేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-03-20T21:47:41+05:30 IST

రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ సోము వీర్రాజు అన్నారు.

వైసీపీని గద్దె దింపేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం: సోము వీర్రాజు

కర్నూలు: రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ సోము వీర్రాజు అన్నారు. బీజేపి జనసేన కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తువుంటుందని మేము చెప్పలేదు మీరనుకుంటున్నారు అంటూ మీడియానుద్దేశించి అన్నారు.రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ చేశారు.


వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారు. ఏపీ పై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇస్తుందన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజి తో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు జగన్ మాయలో పడి యూ టర్న్ తీసుకున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-20T21:47:41+05:30 IST