
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లులు కురిపించారని బీజేపీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం ఆయిందని కేంద్ర మంత్రి ప్రకటించారని తెలిపారు. ఏపీ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ బీజేపీ వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. కోనసీమ రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందని తెలిపారు. అదే విధంగా కడప - బెంగుళూరుకు రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయకపోవడంతో పనులు ఆగిపోతాయని ప్రకటించారు అంటే కడప - బెంగుళూరు రైల్వే లైన్ స్టేట్ షేర్ కట్టించేవిధంగా ఉద్యమిస్తామని అన్నారు. ఏపీ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సోమువీర్రాజు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి