అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా ఎంతో కృషి చేశారని అన్నారు. నిన్నటి వరకు కూడా రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దుబాయ్లో పర్యటించిన మేకపాటి గౌతంరెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందని ఆవేదన చెందారు. శాశనమండలికి హాజరైన సందర్భంలో తనకు ఉన్న అనుబంధాన్ని సోమువీర్రాజు గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ వంతమైన రాజకీయ నేతను కోల్పోయిందని తెలిపారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తుది శ్వాస వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేసిన గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని సోమువీర్రాజు ప్రార్ధించారు.
ఇవి కూడా చదవండి