
గుంటూరు: రాజకీయాల్లో మార్గదర్శకం వహించిన వ్యక్తి యడ్లపాటి వెంకటరావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తెనాలిలో యడ్లపాటి భౌతికకాయానికి సోమువీర్రాజు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి చేయడంలో యడ్లపాటి ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. జిల్లాలో అనేక మందిని రాజకీయాల్లో తీర్చిదిద్దిన వ్యక్తి అని అన్నారు. రాజకీయాల్లో యడ్లపాటి నడవడి వ్యవహార శైలి ఆదర్శనీయమన్నారు. 104 ఏళ్ళ వయస్సులో కూడా సమాజం పట్ల చురుగ్గా ఉండేవాళ్లని చెప్పారు. యడ్లపాటి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సోమువీర్రాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి