విషజ్వరాలు విజృంభిస్తున్నా.. కేసీఆర్‌కు పట్టడం లేదు..

ABN , First Publish Date - 2022-08-07T03:27:56+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా.. సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. అధికారికంగా 7వేల మంది వైరల్ ఫీవర్ బారిన పడ్డారని..

విషజ్వరాలు విజృంభిస్తున్నా.. కేసీఆర్‌కు పట్టడం లేదు..

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా.. సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. అధికారికంగా 7వేల మంది వైరల్ ఫీవర్ బారిన పడ్డారని, గ్రామాల్లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులను కొద్ది రోజులకే ఎత్తేశారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె శనివరం పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే.. 


‘‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నయి. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు.. లేదంటే కుటుంబానికి కుటుంబమే మంచం పట్టారు. మలేరియా, డెంగీతో పాటు పెద్ద సంఖ్యలో వైరల్ ​ఫీవర్ ​వ్యాప్తి చెందుతోంది. అధికారికంగా ఇప్పటివరకు 7వేల మంది వైరల్ ​ఫీవర్ బారిన పడినట్లు డాక్టర్లు చెప్తున్నరు. గోదావరి వరదలు తగ్గగానే శానిటేషన్​పేరిట కొంత హడావిడి చేసిన ఆఫీసర్లు ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో భయపడ్డట్టే విషజ్వరాలు వణికిస్తున్నయి. వరదల తర్వాత అన్ని గ్రామాల్లోనూ పెట్టిన మెడికల్ ​క్యాంపులను కొద్దిరోజులకే ఎత్తేశారు.


‘‘కొన్నిచోట్ల మెడికల్ క్యాంపులు నడుస్తున్నా కేవలం పారసిటమాల్​లాంటి ఒకటి, రెండు టాబ్లెట్లు మాత్రమే ఇస్తున్నరు. వాటితో జ్వరం తగ్గకపోవడంతో బాధితులు సర్కారు ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు క్యూ కడ్తున్నరు. అక్కడికికెళ్లినా తగ్గని కొందరు... అప్పులు చేసి మరీ ప్రైవేటు దవాఖానాలకు వెళ్తున్నరు. ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ స‌ర్కార్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ ప్ర‌జానీక‌మే త‌గిన బుద్ధి చెప్పడం ఖాయం’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-08-07T03:27:56+05:30 IST