‘‘పీఎం కిసాన్’’ను నిర్లక్ష్యం చేస్తున్నారు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-05-29T01:41:57+05:30 IST

తెలంగాణలో పీఎం కిసాన్ పథకం నిధులు.. సగం మందికి కూడా అందడం లేదని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్‌కు, ప్రధాని మోదీని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ..

‘‘పీఎం కిసాన్’’ను నిర్లక్ష్యం చేస్తున్నారు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో పీఎం కిసాన్ పథకం నిధులు.. సగం మందికి కూడా అందడం లేదని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్‌కు, ప్రధాని మోదీని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ.. రైతులకు మేలు చేయడంలో లేదని విమర్శించారు. పీఎం కిసాన్ వర్తించాలంటే ఈ నెలాఖరులోపు ఈకేవైసీ చేసుకోవాలని, కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ విజయశాంతి.. సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..


‘‘కేంద్ర ప్రభుత్వం రైతుల‌కు పెట్టుబడి సాయంగా అందించే పీఎం కిసాన్​పథకం నిధులు తెలంగాణ రైతుల్లో సగం మందికి అందడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా... పాస్‌బుక్​ ఉన్న రైతుల్లో 50 శాతం మందికి మాత్రమే పీఎం కిసాన్​ అందుతోంది. కొత్తగా పాస్​బుక్​లు వచ్చిన లక్షలాది మందిని లబ్ధిదారులుగా గుర్తించట్లేదు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులకు పాస్‌బుక్‌లు బదిలీ అయినా... పీఎం కిసాన్‌కు అప్రూవ్​చేయడం లేదు. ఫలితంగా లక్షలాది మంది రైతులు కేంద్రం సాయాన్ని పొందలేకపోతున్నారు. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే ప్రక్రియలో జాప్యంతో అర్హులైన వారు కూడా పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు.


‘‘దీంతో రైతుబంధు సాయం అందుకుంటున్న వారిలో సగం మందికి కూడా పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు ఉండగా... పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 39.67 లక్షల మందినే రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి కేంద్రానికి పంపించారు. దీంతో 17.94 లక్షల మంది పీఎం కిసాన్ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే పీఎం కిసాన్​ కోసం ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొబైల్ నంబర్‌ను లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 31తో ఆ గడువు ముగియనుంది.


‘‘అయితే కిందిస్థాయి అధికారులు పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రైతులకు అవగాహన కల్పించడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి అస‌లు ప‌టించుకోవ‌డం లేదు. కేసీఆర్... కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీగారిని విమ‌ర్శించడం కాదు. కేంద్రం ఇస్తున్న ప‌థకాల‌ను రాష్ట్ర ప్రజ‌ల ద‌గ్గర‌కు చేర్చు. రైతుల‌కు పీఎం కిసాన్ ప్రయోజనం అందితే త‌మకు ఎక్కడ ఓట్లు పోతాయోన‌ని కేసీఆర్ స‌ర్కార్ దీన్ని నిర్లక్ష్యం చేస్తోంది. కేసీఆర్... నువ్వు చేస్తున్న అక్రమాలను తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. త్వరలోనే ఈ అన్నదాతలు నీకు, నీ స‌ర్కార్‌కు బుద్ధి చెబుతారు’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-29T01:41:57+05:30 IST