Vijayashanti: బీజేపీపై విజయశాంతి తీవ్ర అసంతృప్తి

ABN , First Publish Date - 2022-08-18T20:16:49+05:30 IST

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Vijayashanti: బీజేపీపై విజయశాంతి తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నాయకత్వం(BJP state leadership)పై విజయశాంతి (Vijayashanti) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు యాక్టివ్గా లేరంటూ మీడియా అడిగిన ప్రశ్నకు పార్టీ నాయకత్వాన్నే అడగాలంటూ సమాధానం ఇచ్చారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నేతల దగ్గర స్పష్టత లేదన్నారు. పార్టీలో మాట్లాడడానికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో పార్టీ నాయకులనే అడగాలని తెలిపారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలనుకుంటున్న వారిని పాతరేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను అసంతృప్తిగా ఉన్నానని మీకు కూడా అన్పిస్తోందా?’’ అంటూ అని మీడియాకు ఎదురు ప్రశ్నలు వేశారు. ఫైర్ బ్రాండ్ను ఎందుకు సైలెంట్లో పెట్టారో బండి సంజయ్ (Bandi sanjay), లక్ష్మణ్ (Laxman)కే తెలియాలన్నారు. 


‘‘పని చెప్తే కదా... పార్టీ పని చేసేది. పని ఇవ్వకుండా చేయమంటే నేనేమి చేయాలి. జాతీయ పార్టీతో‌ ఇబ్బంది లేదు.. రాష్ట్ర నాయకత్వమే ఉపయోగించుకోవటం లేదు. సీనియర్ నేతలను కలుపుకుని పోకుంటే పార్టీకే నష్టం. నా వల్ల పార్టీలో కొందరు నేతలు అభద్రతాభావంతో ఉన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలి’’ అని విజయశాంతి అన్నారు. 

Updated Date - 2022-08-18T20:16:49+05:30 IST