నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యలు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-07-22T14:57:01+05:30 IST

హుజూరాబాద్‌లో దళిత బంధు పథకంపై కేసీఆర్ మాటలు, నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నచందంగా ఉన్నాయని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు.

నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యలు: విజయశాంతి

హైదరాబాద్: హుజూరాబాద్‌లో దళిత బంధు పథకంపై కేసీఆర్ మాటలు, నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నచందంగా ఉన్నాయని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలని చెప్పడం ద్వారా హుజూరాబాద్‌లో గెలవలేని పరిస్థితులు ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తుందని తెలిపారు. అట్లానే... గెలవలేని పార్టీలు హామీలు ఇయ్యంగ లేంది టీఆర్ఎస్ ఇస్తే తప్పేంది అన్నారని... మరి హుజూర్‌నగర్, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికల హామీలు యాడపాయె...? అని ప్రశ్నించారు. తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్న ఈ ముఖ్యమంత్రి అందుకు నిధులేడకేల్లి కేటాయించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా కేసీఆర్‌ను విశ్వసించటమంటే తుపాకీ రాముడు మాటలకు, తుగ్లక్ వాగ్దానాలకు చెవొగ్గే మూర్ఖత్వమే అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2021-07-22T14:57:01+05:30 IST