చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ నాయకులు

ABN , First Publish Date - 2022-08-15T05:32:54+05:30 IST

చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తు న్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌ ఆరోపిం చారు.

చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ నాయకులు
సమావేశంలో మాట్లాడుతున్న భూపాల్‌

- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 14: చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తు న్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌ ఆరోపిం చారు. ఆదివారం గోదావరిఖ ని శ్రామిక భవన్‌లో స్వాతం త్య్ర ఉద్యమం-కమ్యూనిస్టుల త్యాగాలు-నేటి పరిస్థితులు అనే అంశంపై జరిగిన సద స్సుకు ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. స్వా తంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ ఎస్‌ పాత్ర ఏమి లేదని, స్వా తంత్య్ర ఉద్యమ సమయం లో బ్రిటీష్‌వారు అరెస్టుచేసి జైల్లో వేస్తే బ్రిటీష్‌ వారికి వ్యతి రేకంగా పోరాటం చేయబోమని, వారికి విధేయులుగా ఉం టామని లేఖ రాసి ఉద్యమానికి ద్రోహం చేశారని, అలాంటి వారికి వారసులుగా ఇప్పుడు బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. స్వాతం త్య్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేసి నిర్భంధాలను ఎదుర్కొని జైల్లో ఉన్నారని, సంపూర్ణ స్వాతం త్య్రం కావాలని డిమాండ్‌ చేసింది కమ్యూనిస్టులేనని, భగత్‌ సింగ్‌లాంటి అనేక కమ్యూనిస్టులు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకం గా పోరాటం చేశారన్నారు. స్వాతంత్య్ర ఫలాలు కొందరికే అందుతున్నాయని, భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి మనువాద సిద్ధాంతాన్ని తీసుకువచ్చి దళితుల కు, పేదలకు, కార్మికులకు విద్య, వైద్యం, కనీస వేతనాలు లేకుండా చేస్తోందన్నారు. అందులో భాగంగానే విద్యను కాషాయమయం చేస్తోందని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉపాధి లేకుండా మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం లో ఏమి మిగలవని, బీజేపీని గద్దె దించేందుకు ప్రతి ఒక్క రూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం కార్య వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తుమ్మల రాజారెడ్డి, వై యాకయ్య, మహేశ్వ రి, రామాచారి, మెండె శ్రీనివాస్‌, శంకర్‌, లావణ్య, నర్సయ్య, నాగమణి, బిక్షపతి, యాకూబ్‌, లలిత, కొమురయ్య, వెంకట స్వామి, రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:32:54+05:30 IST