నిరసనకారులకు bulldozers and bulletsతోనే అర్థం అవుతోంది...బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-06-13T12:56:28+05:30 IST
కర్ణాటక బీజేపీ నేత సీటీ రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు...
బెంగళూరు(కర్ణాటక):కర్ణాటక బీజేపీ నేత సీటీ రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లర్లు చేస్తున్న వారిపై బుల్డోజర్లు, బుల్లెట్లతో అర్థం అవుతుందని బీజేపీ నేత సీటీ రవి వ్యాఖ్యానించారు. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు, రాళ్లదాడి చేసిన వారికి బుల్డోజర్లు, బుల్లెట్లతో సమాధానం చెబితే వారికి అర్థమవుతుందని సీటీ రవి చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ నగర పరిధిలోని అటాలా ప్రాంతంలో అల్లర్ల నిందితుడు మహ్మద్ జావేద్ ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేసిన నేపథ్యంలో బీజేపీ నేత సీటీ రవి ఈ వ్యాఖ్యలు చేశారు.