విశాఖపట్నం నాట్ ఫర్ సేల్: bjp leaders

ABN , First Publish Date - 2021-10-06T17:26:31+05:30 IST

ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడం దారుణమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.

విశాఖపట్నం నాట్ ఫర్ సేల్: bjp leaders

విశాఖపట్నం: విశాఖ నాట్ ఫర్ సేల్ అని బీజేపీ నేతలు అన్నారు. బుధవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ చేపట్టిన మహాధర్నాలో  ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. రెండో దశలో కలెక్టర్‌తో పాటు, మిగిలిన 11 ఆస్తులు కూడా పెట్టేస్తారన్నారు. మూడో దశలో కేజీహెచ్, విమ్స్, ఘోష ఆసుపత్రి ఆర్కే బీచ్ కైలాసగిరి కూడా పెట్టేస్తా రేమో అని యెద్దేవా చేశారు. మీ భారతి సిమెంటు,  ఇడుపులపాయ ఎస్టేట్, బెంగళూరులో భారీ భవనం లోటస్ పాండ్ పెట్టొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుని, అప్పులు ఇస్తున్న బ్యాంకులపైన కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. 


బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ...ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, రాజ్యాంగ విరుద్ధమని...నిర్ణయంపై న్యాయపోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నాట్ ఫర్ సేల్ ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 

Updated Date - 2021-10-06T17:26:31+05:30 IST