రాష్ట్ర పథకాలకు కేంద్ర నిధులే ఆసరా

ABN , First Publish Date - 2021-03-01T04:15:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు అందించేది కేంద్ర ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్‌రావు అన్నారు.

రాష్ట్ర పథకాలకు కేంద్ర నిధులే ఆసరా
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

కార్యకర్తల శిక్షణ శిబిరంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
ఏసీసీ, ఫిబ్రవరి 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు అందించేది కేంద్ర ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లో ఏర్పాటుచేసిన బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబి రంలో మాట్లాడుతూ నేషన్‌ ఫస్ట్‌, పార్టీ నెక్ట్స్‌, ఇండివ్యూజువల్స్‌ లాస్ట్‌ అనే కాన్సెప్ట్‌తో పాలన సాగుతోందన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లకు 95 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంద న్నారు. 2025 నాటికి దేశంలో అందరికి ఇండ్లు నిర్మించే బృహత్తర ఆలోచన మోదీ ప్రభుత్వం చేస్తుందన్నారు. గ్రామీణ సడక్‌యోజన ద్వారా దేశంలో అన్ని గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కలిగిం దన్నారు. వైకుంఠధామం నిర్మాణానికి నిధులు సమకూర్చేది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌, నాయకులు శ్యాం సుందర్‌రావు, రజనీష్‌జైన్‌, ఆనంద్‌ కృష్ణ, మహిళ అధ్యక్షురాలు వెంకటకృష్ణ, తులా మధు సూదన్‌ రావు, హరికృష్ణ, మంచిర్యాల, నస్పూర్‌, హాజీపూర్‌ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.


ప్రశ్నిస్తే పట్టపగలే హత్యలు చేస్తారా
లక్షెట్టిపేట: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచ కాలు, అక్రమాలను ప్రశ్నిస్తే పట్టపగలే హత్యలు చేస్తారా అని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం  విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడుతూ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నది దోపిడి కోసమా, అక్ర మ సంపాదన కోసమా అని ప్రశ్నించారు.  అవి నీతి, అక్రమాలను ప్రశ్నించినందుకా వామన్‌ రావును నడిరోడ్డుపై పట్ట పగలు హత్య చేశారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు.  


ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
హాజీపూర్‌: గుడిపేట బుగ్గగట్టు ఆంజనేయ స్వామిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆదివారం దర్శించుకున్నారు. రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందితే 101 కొబ్బరికాయలు కొడతామని మండల నాయకులు మొక్కుకున్నా రు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళగా స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టారు. తిరుపతి, రమణారావు, పురుషోత్తం, నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:15:01+05:30 IST