సాయుధ పోరాటంపై బీజేపీ తప్పుడు భాష్యం

ABN , First Publish Date - 2022-10-01T05:32:21+05:30 IST

భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టులు సాగించిన పోరాటంపై బీజేపీ తప్పుడు భాష్యం చేబుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్‌ అన్నారు.

సాయుధ పోరాటంపై బీజేపీ తప్పుడు భాష్యం
సభలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

వలిగొండ, సెప్టెంబరు 30: భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టులు సాగించిన పోరాటంపై బీజేపీ తప్పుడు భాష్యం చేబుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్‌ అన్నారు. మొగిలిపాక గ్రామంలో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ నాటి పోరాటం కులం, మతం, ప్రాంతానికి సంబంధం లేకుండా  స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం, దోపిడి నుంచి విముక్తి కోసం జరిగిందన్నారు.  మొగిలిపాకకు చెందిన గాంధీ వెంకట నర్సింహారెడ్డి నాయకత్వంలో 16 మంది దళ సభ్యులుగా ఏర్పడి, నైజాం రజాకార్ల, భూస్వాముల దోపడీ దౌర్జన్యాలపై ప్రజలను చైతన్యం పరిచారని వివరించారు. ఈ పోరాటాన్ని బీజేపీ నేడు హిందువులు, ముస్లింల గొడవగా చిత్రించే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు అర్థం చేసుకుని మతోన్మాద బీజేపీ చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సభ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గుండె పురి నర్సింహ అధ్యక్షతన జరిగింది.  కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాటూరి బాలరాజ్‌,  మద్దెల రాజయ్య, గడ్డం వెంకటేష్‌, బొడ్డుపల్లి వెంకటేష్‌, మొగిలిపాక గోపాల్‌, మామిడి వెంకట్‌రెడ్డి,  ముత్యాలు, సురేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-01T05:32:21+05:30 IST