తాలిబాన్ సంక్షోభం వల్లే పెట్రో, గ్యాస్ ధరలు పెరిగాయి : అరవింద్ బల్లాడ్

ABN , First Publish Date - 2021-09-04T22:57:01+05:30 IST

దేశ వ్యాప్తంగా పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

తాలిబాన్ సంక్షోభం వల్లే పెట్రో, గ్యాస్ ధరలు పెరిగాయి : అరవింద్ బల్లాడ్

బెంగళూరు : దేశ వ్యాప్తంగా పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పెట్రో, గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయో కర్నాటక బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివరించారు.  హుబ్లీ - ధార్వాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ మాట్లాడుతూ.... ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల సంక్షోభం వల్లే భారత్‌లో పెట్రో, గ్యాస్ ధరలు పెరిగాయని పేర్కొన్నారు. ‘‘ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ వ్యవహారం నడుస్తోంది. దీంతో చమురు ధరల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి. పెట్రో, గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయన్న విషయంలో ప్రజలు స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు’’ అని అరవింద్ బల్లాడ్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-09-04T22:57:01+05:30 IST