
- Bjp mla అరవింద్ బెల్లద్
బెంగళూరు: పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ పేర్కొన్నారు. నగరంలో మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బొమ్మై కేబినెట్లో చోటు లభిస్తుందని ఆశిస్తున్న మాట నిజమేనని అంగీకరించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికోసం మీ పేరు వినిపిస్తోంది కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నింగా.. దీని గురించి తనకేమీ తెలియదన్నారు. అయితే పార్టీ తనకు ఏదో ఒక గురుతర బాధ్యతను అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నానన్నారు. ఒక వేళ ఎలాంటి బాధ్యత అప్పగించకపోయినా ఒక సామాన్య కార్యకర్తలా పార్టీకి సేవలందిస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి