BJP MLA Raja Singh: ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు...పోలీసు కేసు నమోదు

ABN , First Publish Date - 2022-08-23T14:58:20+05:30 IST

హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) రాజాసింగ్(Raja Singh) సోమవారం రాత్రి ముహమ్మద్ ప్రవక్తపై(Prophet Muhammad) అభ్యంతరకరమైన వ్యాఖ్యలు(derogatory remarks)...

BJP MLA Raja Singh: ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు...పోలీసు కేసు నమోదు

హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) రాజాసింగ్(Raja Singh) సోమవారం రాత్రి ముహమ్మద్ ప్రవక్తపై(Prophet Muhammad) అభ్యంతరకరమైన వ్యాఖ్యలు(derogatory remarks) చేశారు. ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు(arrest) చేయాలని డిమాండు చేస్తూ ఆందోళనకారులు సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ముస్లింలు నిరసన(Protests broke out) తెలిపారు. సమాజం మనోభావాలను కించపరిచిన రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మంగళవారం పోలీసులు కేసు(police case) నమోదు చేశారు.



మహ్మద్ ప్రవక్తపై కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. హైదరాబాద్(Hyderabad) నగర పోలీస్‌ కమిషనర్‌(police commissioner) సీవీ ఆనంద్‌(CV Anand) కార్యాలయం ఎదుట, పాత నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.రాజాసింగ్ సమాజం మనోభావాలను దెబ్బతీశారని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బషీర్ బాగ్‌లోని కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.గత వారం హైదరాబాద్‌లో హాస్యనటుడు మునావర్ ఫరూఖీ(Munavar Faruqui) నిర్వహించిన ప్రదర్శనపై బీజేపీ ఎమ్మెల్యే కామెడీ వీడియోను విడుదల చేశారు.



 అంతకుముందు రాజా సింగ్ ఫరూఖీ షోను ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే వేదిక వద్ద ఉన్న సెట్‌ను తగలబెడతానని బెదిరించారు. బెదిరింపుల కారణంగా రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.మునావర్ ఫరూఖీ హిందువుల(Hindus) మత మనోభావాలను దెబ్బతీశారని రాజా సింగ్ ఆరోపించారు. ఆ వీడియోలో ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేశారు.



Updated Date - 2022-08-23T14:58:20+05:30 IST