స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: Etela

ABN , First Publish Date - 2022-03-15T18:35:16+05:30 IST

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: Etela

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమకు కేటాయించిన సీట్లలో నిలబడితే సస్పెండ్ చేయటం అనైతికమని మండిపడ్డారు. సభా సంప్రదాయాలను మంటగలిపే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని తూలనాడిన మంత్రితో ఉద్యమకారులను సస్పెండ్ చేయించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తరిమి తరిమి కొడతామన్న వ్యాఖ్యలను సీఎం  మర్చిపోయినట్లున్నారని తెలిపారు. తెలంగాణలో చంద్రశేఖర్రావు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్నారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని బొందపెట్టే అతింత నిర్ణేతలు ప్రజలే అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-15T18:35:16+05:30 IST