Etela Challenge: సీఎంకు దమ్ముంటే నన్ను అసెంబ్లీలోకి రానివ్వాలి: ఈటల

ABN , First Publish Date - 2022-09-07T20:08:00+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు దుమ్ముంటే తనను అసెంబ్లీలోకి రానివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) ఈటల రాజేందర్ (Etela rajender) సవాల్ విసిరారు.

Etela Challenge: సీఎంకు దమ్ముంటే నన్ను అసెంబ్లీలోకి రానివ్వాలి: ఈటల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు దుమ్ముంటే తనను అసెంబ్లీలోకి రానివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) ఈటల రాజేందర్ (Etela rajender) సవాల్ విసిరారు. ‘‘నా ముఖం చూడనని ధైర్యముంటే సభలో కేసీఆర్(Telangana CM) ప్రకటించాలి. ప్రజాక్షేత్రంలోనే మేం తేల్చుకుంటాం.. చావుకైనా సిద్దం కాని రాజీపడే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు. అణగారిన వార్గాల పక్షాన పోరాడేందుకు బీజేపీ ఎల్లప్పుడూ సిద్దంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో కేసీఆర్ (TRS Chief) రాచరిక పాలన  రాష్ట్రంలో చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నాకు ఏం నోటీసులు పంపుతారో చూస్తాం... ఇప్పటి వరకు నాకు ఎలాంటి నోటీసులు అందలేదు’’ అని ఈటల రాజేందర్ తెలిపారు. 

Updated Date - 2022-09-07T20:08:00+05:30 IST