MLA: ఆ గొంతు నాదే..

ABN , First Publish Date - 2022-09-06T16:51:09+05:30 IST

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షల అక్రమాలకు సంబంధించి అభ్యర్థులతో నగదు పొందారనే ఆడియో వైరల్‌ అయింది. అందులో మాట్లాడింది తానేనంటూ

MLA: ఆ గొంతు నాదే..

                             - ఎస్‌ఐ పరీక్షల అక్రమాల ఆడియోపై బీజేపీ ఎమ్మెల్యే


బెంగళూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షల అక్రమాలకు సంబంధించి అభ్యర్థులతో నగదు పొందారనే ఆడియో వైరల్‌ అయింది. అందులో మాట్లాడింది తానేనంటూ కొప్పళ జిల్లాకు చెందిన కనకగిరి బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ దడేసగూరు(MLA Basavaraja Dadesaguru) అంగీకరించారు. ఎస్‌ఐ పోస్టుల అక్రమాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న విషయం ఆరంభం నుంచి ప్రచారంలో ఉంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆడియోలోని మాటలు తనవేనని అంగీకరించడం ప్రతిపక్ష కాంగ్రెస్‏కు బలాన్నిచ్చినట్టయింది. ఎస్‌ఐ పోస్టుల అ క్రమాలపై పరసప్ప అనే వ్యక్తి కుమారుడి ఉద్యోగ విషయమై ఎమ్మెల్యే మాటల ఆడియో సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. బళ్లారి జిల్లా సిరుగుప్పకు చెందిన పరసప్ప నుంచి నగదు పొంది ప్రభుత్వానికి ముట్టచెప్పానని ఎమ్మెల్యే ఆడియోలో వ్యాఖ్యానించారు. నగదు వాపసు కోరిన పరసప్పపై ఎమ్మెల్యే(MLA) ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్రంలో సంచలనమైం ది. ఎమ్మెల్యే బసవరాజ ఆడియో తనదేనని అంగీకరించడంతో వెంటనే అతడిని అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ ప్రచార క మిటీ అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-09-06T16:51:09+05:30 IST