మంత్రి కేటీఆర్‌కు తొందర ఎక్కువైంది: Raghunandan rao

ABN , First Publish Date - 2022-04-15T19:16:33+05:30 IST

మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24గంటలు ఉచిత కరెంటు ముచ్చటే లేదన్నారు.

మంత్రి కేటీఆర్‌కు తొందర ఎక్కువైంది: Raghunandan rao

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24గంటలు ఉచిత కరెంటు ముచ్చటే లేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు తొందర ఎక్కువైందని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన  కేటీఆర్‌లో కన్పిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్  బెడ్ రూం ఇళ్ళ కోసమే బండి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. సీఎం‌ కేసీఆర్ సంతకం వలనే కృష్ణా జిల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 290 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్‌కు తెలియకపోవటం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే రిటైర్‌ అయి‌న అధికారులను  కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.


గజ్వేల, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మాత్రమే 24 గంటల కరెంట్ ఉంటోందని తెలిపారు. తన ఊరుతో సహా.. ప్రభాకరరావు, మంత్రి ఎర్రబెల్లి ఊర్లల్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. మోటార్లుకు మీటర్లు పెడ్తారన్న మంత్రి హరీష్ రావు ఇప్పుడేమి చెప్తారని ప్రశ్నించారు. రైతుల డిమాండ్ మేరకు రాత్రిపూట కూడా కరెంటు ఇవ్వాలన్నారు. నదీ జలాల పంపకంపై ప్రతినిధుల బృందం ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్ళటం కారణంగానే కృష్ణా నదీజాలాల పంపకాల్లో జాప్యం జరిగిందన్నారు. ఎండుతోన్న పంటతో తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఉచిత కరెంట్‌పై క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్తోన్న టీఆర్ఎస్ పెద్దలు చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. 

Updated Date - 2022-04-15T19:16:33+05:30 IST