RGVకి రాజాసింగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2022-06-24T19:39:38+05:30 IST

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.

RGVకి రాజాసింగ్ వార్నింగ్

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram gopal varma)కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన... ఆర్జీవీని వేస్ట్ ఫెలోతో పోల్చారు. రాంగోపాల్ వర్మ తాగి ట్వీట్స్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటారని, ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్‌ను ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-06-24T19:39:38+05:30 IST