
- పోలీసులకు ఫిర్యాదు చేసిన హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య
బెంగళూరు: రాష్ట్రంలో కొనసాగుతున్న పలు పరిణామాల ప్రభావం ఎమ్మెల్యేలనే హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ దాకా చేరింది. హొన్నాళి ఎమ్మెల్యే, సీఎం రాజకీయ కార్యదర్శి రేణుకాచార్యకు బెదిరింపు కాల్ రాగా బెంగళూరు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ బుధవారం వరుసగా ఫోన్ ఒకే నంబరు నుంచి కాల్ వస్తున్నా శాసనసభ సమావేశాలు ఉన్నందున చూసుకోలేదన్నారు. గురువారం ఉదయం గుర్తు తెలియని నంబర్ నుంచి పదేపదే ఫోన్ వస్తుండటంతో రిసీవ్ చేశానన్నారు. ఒక్కసారిగా అవతలి వ్యక్తి రెచ్చిపోయి మూడునాలుగు రోజుల్లో నీతో పాటు నీ కుమారుడిని హతమారుస్తామని బెదిరించారన్నారు. హిజాబ్, ముస్లిం వ్యాపారాల నిషేధం, హలాల్కట్ వంటి అంశాలపై ప్రజలను రెచ్చగొడుతున్నారని హెచ్చరించారన్నారు. తనతో పాటు ఎమ్మెల్యేలు సీటీ రవి, బసవనగౌడ పాటిల్ యత్నాళ్ను హతమారుస్తామని బెదిరించారన్నారు. ఈ మేరకు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు ప్రాథమికంగా ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారన్నారు.
ఇవి కూడా చదవండి