Bjp mlaలకే అగ్రతాంబూలం

ABN , First Publish Date - 2022-03-01T16:46:00+05:30 IST

బెంగళూరు మహానగర పాలికె ఎన్నికలకు ముందే అభివృద్ధి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా అమృత నగరోత్థాన పథకంలో భాగంగా 10 శాసనసభ నియోజకవర్గాలకు రూ.1793 కోట్లు

Bjp mlaలకే అగ్రతాంబూలం

                    - అమృత నగరోత్థాన పథకంలో రూ.1,793 కోట్లు మంజూర


బెంగళూరు: బెంగళూరు మహానగర పాలికె ఎన్నికలకు ముందే అభివృద్ధి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా అమృత నగరోత్థాన పథకంలో భాగంగా 10 శాసనసభ నియోజకవర్గాలకు రూ.1793 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. తొలి విడతలోనే భారీగా నిధులు కేటాయించింది. అమృత నగరోత్థాన పథకంలో భాగంగా బెంగళూరు మహానగర పాలికెలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 2021 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రకటించారు. ఇందుకుగాను జనవరి 6న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందే సీఎం అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో నగరంలో మౌలిక సదుపాయాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. నగర పరిధిలో రోడ్ల అభివృద్ధి, గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణం, చెరువుల అభివృద్ధి, చెత్త నిర్వహణ, వీధి దీపాల పర్యవేక్షణ, నీటి వనరుల అభివృద్ధి, పార్కుల సమగ్రత వంటి అత్యవసర పనులను చేపట్టాలని నిర్ణయించారు. నగర పరిధిలో 28 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలోనైనా అభివృద్ధి చేపట్టవచ్చు. అయితే తొలి విడతలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా బెంగళూరు దక్షిణకు రూ.206 కోట్లు, ఆర్‌ఆర్‌ నగర్‌కు రూ.208 కోట్లు, మహాలక్ష్మి లే అవుట్‌కు రూ.170 కోట్లు, రాజాజీనగర్‌కు రూ.150 కోట్లు, యలహంకకు రూ.175 కోట్లు, బొమ్మనహళ్లికి రూ.207 కోట్లు, యశ్వంతపురకు రూ.202 కోట్లు, బసవనగుడికి రూ.125 కోట్లు, గోవిందరాజనగర్‌ రూ.200 కోట్లు, సీవీ రామనగర్‌కు రూ.150 కోట్లు కేటాయించారు. నియోజకవర్గాల వారీగా అంచనాలు పూర్తి చేసి 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మౌలిక వసతుల కల్పనలో 50 శాతం నిష్పత్తిన తీసుకోవాల్సి ఉంటుందని నగరాభివృద్ధిశాఖ నివేదికలో ప్రకటించింది. 

Updated Date - 2022-03-01T16:46:00+05:30 IST