MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాబురావ్‌ చించనసూర్‌

ABN , First Publish Date - 2022-07-31T17:37:16+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీని వీడి జేడీఎస్‏లో చేరిన సీఎం ఇబ్రహీం రాజీనామా తో ఖాళీ అయిన విధాన పరిషత్‌ స్థానానికి బీజేపీ నుంచి మాజీ మంత్రి బాబురా

MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాబురావ్‌ చించనసూర్‌

బెంగళూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని వీడి జేడీఎస్‏లో చేరిన సీఎం ఇబ్రహీం రాజీనామా తో ఖాళీ అయిన విధాన పరిషత్‌ స్థానానికి బీజేపీ నుంచి మాజీ మంత్రి బాబురావ్‌ చించనసూర్‌(Former Minister Baburao Chinchanasur)కు టికెట్‌ ఖరారు చేశారు. ఎమ్మెల్యేల కోటా కింద పరిషత్‌లో ఒక స్థానానికి ఎన్నిక జరుగుతున్నందున అధికార బీజేపీకి చెందినవారే గెలుపొందే అవకాశం ఉంది. బీజేపీ పలువురు అభ్యర్థులను పరిశీలించి కోలి సామాజిక వర్గానికి చెందిన బాబూరావ్‌ చించనసూర్‌కు ఖరారు చేశారు. 2024 జూన్‌ దాకా ఇబ్రహీం పదవిలో కొనసాగాల్సి ఉండేది. సోమవారం నామినేషన్ల(Nominations) దాఖలుకు చివరిరోజు కాగా ఆగస్టు 4న పరిశీలన, ఉపసంహరణ పూర్తి కానున్నాయి. ఆగస్టు 11న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. కలబురగి జిల్లా గురుమిట్కల్‌ నుంచి మూడుసార్లు, చిత్తాపుర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

Updated Date - 2022-07-31T17:37:16+05:30 IST