మేధావుల తీర్పు కోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-03-07T06:02:07+05:30 IST

‘రాష్ట్రంలో నియంత పాలనతో ప్రజలు వి సిగిపోయారు.

మేధావుల తీర్పు కోసం ఎదురుచూపు
సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

- 14న ఒక రోజు సమయమిస్తే ఆరేళ్లు రామచందర్‌రావు సేవ చేస్తారు

- రెండేళ్లుగా బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు 

- మంత్రులు పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం

- సమయం వచ్చినప్పుడు మీ బండారం బయట పెడతాం 

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

- నియంత చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం 

- జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల పాలు చేశాడు 

- మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి


మహబూబ్‌నగర్‌/భగీరథకాలనీ, మార్చి 6 : ‘రాష్ట్రంలో నియంత పాలనతో ప్రజలు వి సిగిపోయారు. దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పేదలు బీజేపీ కి పట్టం కట్టారు. ఇప్పుడు జరగబోయే మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మేధావుల తీర్పు కోసం వారు ఎదురు చూస్తున్నారు. మేధావు లు సరైన నిర్ణయం తీసుకొని పని చేసే వారికి పట్టం కట్టాలని’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శ నివారం రాత్రి జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మేధావులంగా ఈ నెల 14న ఒక్క రోజు తమ అభ్యర్థి రామచందర్‌ రావుకు ఓటు వేసి గెలిపిస్తే, ఆరేళ్లు ఆయన మీకు సమయం ఇచ్చి సేవ చేసుకుం టారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారుల విషయంలో మంత్రులు పిచ్చిగా మాట్లాడితే సహించబోమని అన్నారు. పాలమూరులో టీఆర్‌ఎస్‌ మంత్రి రెండేళ్లుగా బీ జేపీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని, కేసులు పెడితే కార్యకర్తలు భయపడతారా అ ని ప్రశ్నించారు. మీ బండారం తెలుసునని, సమయం వచ్చినపుడు అన్నీ తీస్తామని, నీ చరిత్ర తీస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు. రౌడీషీట్‌ పెడితే రివార్డ్‌గా తీసుకుంటామని, ధర్మం కోసం పని చేశామని చెప్పుకుంటామని ఆయన అన్నారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక కీలకమై నదని అన్నారు. నియంత చెర నుంచి తెలంగాణను విముక్తి చేయాలంటే, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావును గెలిపించాలని కోరారు. అత్యధిక సమయం శాసన మండలిలో మా ట్లాడిన వ్యక్తి ఆయనేనని చెప్పారు. జిల్లా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతు న్నారని చెప్పారు. ఓ మంత్రి ఉద్యోగులు, ఉపాధ్యాయులను మూడేళ్లు తామే అధికారంలో ఉంటామని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. మరో మంత్రి సంక్షేమ పథకాల ల బ్ధిదారులకు శాపాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గుల పా ర్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజలు వారిని క్షమించరన్నారు. అందుకే ఈ ఎన్నికలో టీఆర్‌ ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని పట్టభద్రులకు ఆమె పిలుపునిచ్చారు.

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినప్పుడు 16 వేల కోట్ల మి గుల బడ్జెట్‌ ఇస్తే, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శిం చారు. బండి సంజయ్‌ నాయకత్వంలో కేసీఆర్‌కు పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టబో తున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రామ జన్మభూమికి ఒక ఓటు ఒక ఇటుక పేర్చినట్లు అవుతుందని చెప్పారు. తాగుబోతుల పార్టీకి ఓటేస్తే పాపం వస్తుందని చెప్పారు. పీవీని బద్నాం చేయడానికే ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పి.చంద్రశేఖర్‌, శాంతకుమార్‌, పద్మజారెడ్డి, నాగూరావు నా మాజీ, వీరేందర్‌గౌడ్‌, పడాకుల బాలరాజు, శ్రీవర్ధన్‌రెడ్డి, జయశ్రీ, ఎగ్గని నర్సింహులు, ప వన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-07T06:02:07+05:30 IST