సీఎం అఖిలపక్షాన్ని పిలిస్తే మేము కూడా వస్తాం: BJP mlc

Nov 3 2021 @ 12:59PM

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌పై పవన్, ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను తాము స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని పిలుస్తే తాము కూడా వస్తామని... పెట్టుబడుల ఉపసంహరణ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. ఈ ప్రాంతవాసులుగా స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కోసం తాము కూడా పోరాడుతామని స్పష్టం చేశారు.  ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కూడా కేంద్రానికి సూచించామన్నారు. హుజురాబాద్‌లో, బీజేపీ విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. బద్వేలులో గౌరవ ప్రదమైన స్థానం సంపాదించుకుందని.. బద్వేల్‌లో దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. రాబోయే కాలంలో ఎన్నికలు భయానక వాతావరణంలో జరగాలనేది వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు.


వైసీపీపై ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. సంక్షేమమే కాదు అభివృద్ధి కావాలని కూడా ప్రజలు కోరుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయొద్దని హెచ్చరిస్తున్నామని అన్నారు. కేసీఆర్‌తో పాటుగా వైసీపీ కూడా హుజురాబాద్ ఎన్నిక ఒక హెచ్చరికన్నారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులని ఎలా పెడతారని ప్రశ్నించారు. గవర్నర్‌కు తెలియకుండా గవర్నర్ పేరునా ఆస్తులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రుషికొండ హరిత రిసార్ట్ కూల్చివేసి... ఏం నిర్మించాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులు వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి విడిది కోసం దీనిని నిర్మిస్తున్నారని అన్నారు. డబ్బు దుర్వినియోగం చేసి నిర్మాణం చేయడం ఎంత వరకు సమంజసమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.