'మోదీ-యోగి' అంశంతో సూడో సెక్యులరిజానికి ముకుతాడు: నఖ్వి

Published: Sat, 05 Feb 2022 17:18:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మోదీ-యోగి అంశంతో సూడో సెక్యులరిజానికి ముకుతాడు: నఖ్వి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ-బీఎస్‌పీ-కాంగ్రెస్ 'సిండికేట్‌' అయినట్టు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. గతంలో మతతత్వం, కులతత్వం ప్రధానంగా సాగిన ముస్లిం-యాదవ్ అంశాన్ని బీజేపీ 'మోదీ-యోగి' అంశం కనుమరుగు చేసిందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను స్వర్ణయుగం దిశగా తీసుకువెళ్తున్న ఘనత బీజేపీకే దక్కుతుందని పేర్కొన్నారు. పశ్చిమ యూపీలోని గౌతం బుద్ధ్ నగర్ జిల్లాలో నఖ్వి ప్రచారం సాగిస్తున్నారు. ఈ జిల్లాలోని నొయిడా, జెవర్, దాద్రి నియోజకవర్గాల్లో ఈనెల 10న ఎన్నికలు జరుగనున్నారు.

''సూడో సెక్యులరిజం, బుజ్జగింపు రాజకీయాలను తిప్పికొట్టేందుకు అభివృద్ధి, అందరికీ గౌరవం అనే దృఢ సంకల్పంతో బీజేపీ ముందుగు సాగుతోంది. ఎంవై (మోదీ-యోగి) అంశం సాధికారతకు మరోపేరు. మతతత్వం, కులతత్వానికి ప్రతీకగా నిలిచిన ఎంవై (ముస్లిం-యోదవ్) అంశాన్ని బీజేపీ ఎంవై అంశం తెరమరుగు చేసింది'' అని నఖ్వి తెలిపారు. యూపీని 60 ఏళ్లకు పైగా పాలించిన ఎస్‌బీసీ (ఎస్‌పీ-బీఎస్‌పీ-కాంగ్రెస్) సిండికేట్ ప్రజలను వచించిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నఖ్వి పిలుపునిచ్చారు. ఈనెల 10వ తేదీతో ప్రారంభమై ఏడు దశల్లో యూపీ ఎన్నికలు జరుగునున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.