ఏపీ పోలీసులపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ సబ్మిట్ చేస్తా: సీఎం రమేష్

ABN , First Publish Date - 2022-01-25T23:24:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాను అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసులపై

ఏపీ పోలీసులపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ సబ్మిట్ చేస్తా:  సీఎం రమేష్

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాను అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసులపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ సబ్మిట్ చేస్తానని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ తెలియజేశారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద  మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకు అనుగుణంగా పోలీసులు పని చేస్తారా లేదా అంటూ డీజీపీని ఆయన ప్రశ్నించారు. 


కృష్ణా జిల్లాలో అరెస్టు చేసిన బీజేపీ నాయకును విడుదల చేయకుంటే, రాష్ట్రంలో చలో పోలీస్ స్టేషన్‌కు పిలుపునిస్తామని ఆయన ప్రకటించారు. పోలీసు వ్యవస్థను దిగజార్చేలా రాష్ట్రంలో పోలీసులు వ్యవరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల తీరు మారకుంటే ప్రజల గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గుడివాడలో పబ్లిక్‌గా నిర్వహించిన క్యాసినోలో గుడివాడ డీఎస్పీ వాటా ఎంతో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-25T23:24:04+05:30 IST