Bjp Mp Laxman: సీఎం కేసీఆర్‌ వైఖరి ఆడలేక మద్దెలఓడు అన్నట్లుంది

ABN , First Publish Date - 2022-08-22T02:00:05+05:30 IST

సీఎం కేసీఆర్‌ (Cm Kcr) వైఖరి.. ఆడలేక మద్దెలఓడు అన్నట్లుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ (Bjp Mp Laxman)ఎద్దేవా చేశారు. బీజేపీ నిర్వహించిన సభలో ...

Bjp Mp Laxman: సీఎం కేసీఆర్‌ వైఖరి ఆడలేక మద్దెలఓడు అన్నట్లుంది

మునుగోడు: సీఎం కేసీఆర్‌ (Cm Kcr) వైఖరి ఆడలేక మద్దెలఓడు అన్నట్లుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ (Bjp Mp Laxman) ఎద్దేవా చేశారు. బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన టీఆర్‌ఎస్‌ (Trs) నిర్వహించిన సభలో జనం లేక వెలవెలబోయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారన్నారు. ధాన్యం కొనకుండా కేసీఆర్‌ రైతులను ఇబ్బంది పెట్టారని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలన్నారు. నయా నిజాం మెడలు వంచేది బీజేపీ మాత్రమేనని ఎంపీ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. 



Updated Date - 2022-08-22T02:00:05+05:30 IST