బీజేపీకి షాక్.. ఎస్పీలోకి రీటా బహుగుణ తనయుడు..!

ABN , First Publish Date - 2022-01-31T21:18:38+05:30 IST

యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలే అవకాశం..

బీజేపీకి షాక్.. ఎస్పీలోకి రీటా బహుగుణ తనయుడు..!

న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో బీజేపీ అలహాబాద్ ఎంపీ రీటా బహుగుణ జోషి తనయుడు మయాంక్ జోషి పార్టీ మారనున్నారు. బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో సోమవారం సాయంత్రం చేరే అవకాశాలున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


ఈనెల మొదట్లో ముగ్గురు మంత్రులతో సహా డజను మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరడం బీజేపీని ఒక కుదుపు కుదిపింది. రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు ఓబీసీ కేటగిరికి చెందిన వారు కాగా, సమాజ్‌వాదీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్న మాయంక జోషి...బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పటికే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు.. బీజేపీ తమను అలక్ష్యం చేస్తూ ఠాకూర్ సమాజిక వర్గాన్ని ప్రమోట్ చేస్తోందనే అభిప్రాయంతో ఉన్నారు. 2009 నుంచి మయాంక్ లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గానికి పనిచేస్తున్నందున అతనికి టిక్కెట్ ఇవ్వాలని బీజేపీని కోరినట్టు ఇటీవల రీటా బహుగుణ మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2022-01-31T21:18:38+05:30 IST