తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు

ABN , First Publish Date - 2021-12-21T16:02:06+05:30 IST

న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు

న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు కీలక సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఢిల్లీకి చేరుకున్నారు. టీఆర్ఎస్‌పై పోరాట వ్యూహంపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా ముఖ్యనేతలకు ఒక్కొక్క బాధ్యత అప్పజెప్పేందుకు కార్యచరణ సిద్ధమైనట్లు సమాచారం. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మరోసారి ఆధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి భారీ చేరికలకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్ షాతో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌ను కమలనాథులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళనున్నారు. బండి సంజయ్ రెండో విడత పాదయాత్రపై అమిత్ షాతో సమావేశం తర్వాత క్లారిటీ ఇవ్వనున్నారు. ముఖ్యనేతలతో అమిత్ షా విడి విడిగా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-12-21T16:02:06+05:30 IST