
సికింద్రాబాద్ (secunderabad): టీఆర్ఎస్ (Trs) పాలనతో ప్రజలు విసుగుపోయి ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda) అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభ (Bjp Vijaya Sanakalpa Sabha)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్కార్ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దుబ్బాక గెలుపుతో కేసీఆర్కు మతిపోయిందని ఎద్దేవా చేశారు. హుజుర్నగర్ గెలుపుతో కేసీఆర్ అయోమయంలో పడ్డారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని జేపీ నడ్డా విమర్శించారు.
ఇవి కూడా చదవండి