హైదరాబాద్ వేదికగా BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు?

Published: Sun, 29 May 2022 17:49:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon

Hyderabad: జులై మూడో వారంలో రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సారి హైదరాబాద్ వేదికగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసే ఆలోచనలో పార్టీ ఉంది. ఒకవేళ సమావేశం జరిగితే ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇంద్రసేనారెడ్డి అధ్యక్షుడిగా ఉండగా.. 2004లో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరిగాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు తమ రాష్ట్రంలోని నిర్వహించాలని నాలుగైదు రాష్ట్రాలు ప్రయత్నిస్తు్న్నాయి. అయితే ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించే యోచనలో కమలనాథులు ఉన్నారు. హైటెక్స్, నోవాటెల్, ఎన్ కన్వెన్షన్ లాంటి వేదికలను బీజేపీ తెలంగాణ శాఖ పరిశీలిస్తుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.