చల్లాకు బీజేపీ వల

ABN , First Publish Date - 2022-04-21T05:16:15+05:30 IST

పాలమూరుపై దృష్టిసారించిన బీజేపీ జనాదరణ ఉన్న కీలక నా యకులను పార్టీలోకి చే ర్చుకునే ఎత్తుగడలకు తెర తీసింది.

చల్లాకు బీజేపీ వల
చల్లా వెంకట్రామిరెడ్డి

ప్రజాసంగ్రామ యాత్ర పూర్తయ్యేలోగా చేర్చుకునేలా వ్యూహం

చర్చలు జరుపుతున్న ఉమ్మడి జిల్లాకు చెందిన జాతీయ నాయకులు

చేరికపై సన్నిహితులతో చర్చిస్తున్న చల్లా

ఈయనతో పాటు మరో ఇద్దరు పాలమూరు కీలక నాయకులతోనూ సంప్రదింపులు

బీజేపీ వ్యూహాలపై రాజకీయవర్గాల్లో కలకలం 


మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాలమూరుపై దృష్టిసారించిన బీజేపీ జనాదరణ ఉన్న కీలక నా యకులను పార్టీలోకి చే ర్చుకునే ఎత్తుగడలకు తెర తీసింది. రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఉమ్మడి పాలమూరులో రాజకీయ అలజడి రేపు తోంది. తాజాగా అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి, ఇంకో పారిశ్రామికవేత్త, మరో ఇద్దరు కీలక పార్టీల నాయకులను తమవైపు తిప్పుకునేందుకు పార్టీకి చెందిన జాతీయ బాధ్యతల్లో ఉన్న ఉమ్మడి జిల్లా కీలక నేతలిద్దరితోపాటు, ఇతర ముఖ్య నాయకులు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీకి మహబూ బ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో సంస్థాగతంగా ఆది నుంచి కొంతమేర పట్టున్నప్పటికీ, బలమైన స్థానాలు గెలవకపో వడం, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలో ఒకటి రెండు నియోజకవర్గాలకే పరిమితమైందనే విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరి ధిలో పూర్తిగా బలోపేతమయ్యేందుకు ప్రజల్లో పట్టు, పేరు కలిగి ఉండి, వేరే పార్టీల్లో ఆదరణ లేదని భావిస్తోన్న నాయకులకు గాలం వేసినట్లు స్పష్టమవుతోంది. 


రాజకీయంగా పట్టున్న నేతగా చల్లాకు ప్రాధాన్యం

అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలు పొందిన చల్లా వెంకట్రామిరెడ్డి నియోజక వర్గంలో బలమైన నేతగా ప్రాచుర్యం పొందారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనువడైన ఆయన నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే గెలుపొందినా, బలమైన నేతగా ఎదిగారు. ఈయన తండ్రి రాంభూపాల్‌రెడ్డి కూడా అలం పూర్‌ నుంచి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొం దడంతో పాటు కొంతకాలం మంత్రిగానూ పనిచేశారు. 2009లో నియోజక వర్గాల పునర్విభ జనతో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌కావడంతో క్రియాశీలక రాజకీయా లకు కొంత దూరంగా ఉన్న వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో మాత్రం తనపట్టు కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాను మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందేలా వ్యూహాలు అమలు చేస్తున్నారనే చర్చ పాల మూరు రాజకీయాల్లో కొనసాగుతోంది. ఈయన్ను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా అలంపూర్‌తో పాటు పొరుగు నియోజకవర్గాలైన వనపర్తి, కొల్లాపూ ర్‌లలోనూ విస్తరించేందుకు అవకాశ ముంటుందనే వ్యూహంతో బీజేపీ ఈయనకు వలవేసింది. చల్లాను పార్టీలో చేర్చుకుంటే ఆయనకు నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేం దుకు అవకాశం కల్పించడంతో పాటు, ఆయన సూచించిన అభ్యర్థికే అలంపూర్‌తో పాటు ఇంకో నియోజకవర్గంలో పోటీకి అవకాశం ఇచ్చేలా బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈయనతో పాటు ఉమ్మడి జిల్లాలో పట్టున్న, ఇదే ప్రాంతంలోని మరో కీలక మాజీ ప్రజాప్ర తినిధితో పాటు, ఇంకో ముఖ్య వ్యాపారవేత్తను కూడా తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. తద్వారా నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలో బలమైన శక్తిగా ఎదగాలనే సంకల్పంతో పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ జరిగే మే 16న అమిత్‌షా సమక్షంలోగానీ, అంతకు మునుపే మహబూబ్‌నగర్‌లో జరిగే  సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో గానీ చల్లా సహా ఈ కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవాలని పార్టీ ముఖ్య నాయకులు రంగం సిద్ధం చేశారు. ఈ అంశంపై చల్లా వెంకట్రామిరెడ్డి సహా ఇతర కీలక నాయకుల నుంచి గానీ, వారి శిబిరాల నుంచి గానీ స్పష్టత రాలేదు. అదే సమయంలో ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈవిషయమై ప్రచారం జరుగుతున్నప్పటికీ ఖండనలు సైతం లేకపోవడంతో ఈ నాయకులు బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-04-21T05:16:15+05:30 IST