తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు

ABN , First Publish Date - 2022-07-02T06:35:31+05:30 IST

తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు

తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆదేశ్‌ కుమార్‌గుప్తా

- రాష్ట్రంలో గల్లీకో బెల్టుషాపు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

- అభివృద్ధికి మోదీ సహకరిస్తున్నా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న సీఎం కేసీఆర్‌ 

- పార్టీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్‌ కుమార్‌గుప్తా

భూపాలపల్లి కలెక్టరేట్‌, జూలై 1 : తెలంగాణలో బీజేపీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నేతలు, కార్యక్తర లు సమష్టిగా పనిచేస్తే.. అధికారంలోకి రావడం ఖాయ మని పార్టీ ఢిల్లీచీఫ్‌ ఆదేశ్‌కుమార్‌గుప్తా అన్నారు. శుక్రవారం భూపాలపల్లి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గల్లీకో బెల్టుషాపు కనిపిస్తోంది.. కానీ, అభివృద్ధి ఎక్కడా కనిపించడంలేదన్నారు. తెలంగాణ ప్రగతికి బీజేపీ ఎంతో చేస్తున్నా సీఎం కేసీఆర్‌ మాత్రం కేంద్రప్రభుత్వంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని 34 లక్షల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం ద్వారా లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లో జరుగనున్న విజయ సంకల్పసభ కు కార్యకర్తలు పెద్దయెత్తున్న తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజీపీ జిల్లా ఇన్‌చార్జి ఉదయ్‌ప్రతాప్‌, జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్‌, బీజేపీ నేతలు రాజేందర్‌, సత్యపాల్‌ రెడ్డి, బట్టు రవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పని చేయాలి..

కాటారం/మొగుళ్లపల్లి : భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఛత్తీస్‌గడ్‌ మాజీ మంత్రి, కురుద్‌ ఎమ్మెల్యే అజయ్‌ చం ద్రాకర్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అయ్య ప్ప కలల్యాణ మండపంలో బీజేపీ శక్తికేంద్రాల ఇన్‌చార్జులు, బూత్‌ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నియోజకవర్గ శక్తి కేంద్రం ఇన్‌చార్జి కొండాపురం జగన్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, మం డలాల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, మోహన్‌రావు, సంపత్‌, జిల్లా, మండల నాయకులు జగన్‌నాయక్‌, దుర్గం తిరుపతి, విజయారెడ్డి, పాగె రంజిత్‌కుమార్‌, బండం మల్లారెడ్డి, శ్రీహరి, అంకయ్య, రాజేంద్రప్రసాద్‌, కొండ రాజమల్లు తదితరులు ఉన్నారు. అలాగే మొగుళ్లపల్లి మం డల కేంద్రంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్‌ కుమార్‌ గుప్తా మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనకు ప్రజ లు చమరగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ  కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి మోరె రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చెవ్వ శేషగిరి, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు జంబుల రజిత, నాయకులు పాల్గొన్నారు.

 కాళేశ్వరంలో ఛత్తీ్‌సగఢ్‌ ఎమ్మెల్యే పూజలు..

మహదేవపూర్‌ : మండలంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఛత్తీ్‌్‌సగఢ్‌లోని కురుద్‌ ఎమ్మెల్యే అజయ్‌ చంద్రకర్‌ పూజలు నిర్వహించారు. అర్చకులు స్వాగతం పలికి శేష వస్ర్తాలతో ఆశీర్వదించారు. అనంతరం మహదేవపూర్‌ లో బిజేపీ బూత్‌ అధ్యక్షుల శక్తి కేంద్రాల ఇన్‌చార్జిల మీటింగ్‌లో పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల శ్రీధర్‌, మండల ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేందర్‌, బొల్లం కిషన్‌, సూర మహేశ్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టి మనోజ్‌, కోట్ల సిరి శ్రీకాంత్‌, మండల ఉపాఽధ్యక్షుడు గోమాస సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:35:31+05:30 IST