
పాట్నా: బిహార్‌లోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఎన్డీయేలో వీఐపీ కూడా భాగస్వామ్య పార్టీ. రెండేళ్ల క్రితం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూతో కలిసి వీఐపీ పోటీ చేసింది. రెండేళ్లు తిరిగేలోపే వీఐపీ శాసనసభాపక్షం అంతా బీజేపీలో విలీనం కావడం గమనార్హం. కాగా, వీఐపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో భారతీయ జనతా పార్టీ ఒక ఘనత సాధించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ.. మొదటి స్థానంలో ఉన్న ఆర్జేడీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం.. 75 స్థానాలు సాధించి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ 74 స్థానాలో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా వీఐపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో 77 స్థానాలతో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. అయితే తమ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకోవడంపై వీఐపీ అధినేత ముఖేష్ సహాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మిత్ర ధర్మాన్ని మర్చిపోయి, మిత్రపక్ష ఎమ్మెల్యేలనే కొనుగోలు చేసిందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి