
కడప: సీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. రాయలసీమ ప్రాంత సమస్యలపై బీజేపీ ఆధ్యర్యంలో కడపలో "రాయలసీమ రణభేరి" పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వీర్రాజు మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్ట్ ముంపు బాధితులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ న్యాయం చేయలేదని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రధాని మోదీ పూర్తి చేస్తారని తెలిపారు. రాయలసీమలో ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామని వీర్రాజు ప్రకటించారు.
రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్షవైఖరికి నిరసనగా ఈ సభను నిర్వహించారు. ఈ సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు సునీల్ దేవధర్, సోమువీర్రాజు, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, మాజీమంత్రులు పురందేశ్వరి, ఆదినారాయణరెడ్డిలతో పాటు ఇతర రాష్ట్ర నేతలు, రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి బీజేపీ నేతలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి